నీ చిరునవ్వుతో చిత్రహింసలెన్నో పెడతావే…..మల్లె మొగ్గవు నీవై మత్తులో దించుతావే….ఎన్నని చెప్పను ఉపమానాలు……ఎక్కడని వెతకను నా చిరునామాను….కనిచూపు వలను విసిరి….వెంట పడినా అందకుండా ఎందుకిలా వేధిస్తావు…ఏదని చెప్పను నీ సాటి అందం…ఎంతని చెప్పను నిను చూసిన క్షణం నాలో ఆనందం…నీ కులుకుతో కునుకు దరిచేరనివ్వవు…కునుకుపట్టి నిదరోతే కలవై చేరి కనులుతెరువనివ్వవుఏమని చెప్పను నాలో ఈ భావం నీవేనని….నా ప్రేమకు జీవం నీ తోడేనని…. నా ప్రాణమే నీవని… అంటూ విరహావేదనతో అల్లాడుతున్న ప్రేమికుడి మనసు బాధ ఇది💐!!నేనుContinue reading “ప్రేమికుడి విరహవేదన…”
Author Archives: శశిరేఖ ✍🏻
అతని జాడేది …
చల్లని పవనం మెత్తగా నా మేనును తాకి పులకింపచేస్తుంటే…మేఘుడు చిరుజల్లును ఎక్కడో విరజిమ్ముతున్నాడని తలచి……ఆకసంబును తేరిపారా జూస్తూ…పరవళ్లు తొక్కుతూ గలగలా పారుతున్న కృష్ణమ్మయదను ముద్దాడ చెంగు చెంగున గెంతుతున్న తెల్లని కుందేళ్లను తరుముతూ పరుగు పరుగున కాలువ గుట్టును చేరుకున్నా……మనసు మూగబోయి మాటమౌనమాయి..ఒంటరిగా కూర్చున్న ఓ అందగాడ్ని చూసాను……ఏమోయ్, అక్కడేం చేస్తున్నావ్ అనిపిలవాలనిపించింది…కానీ కన్నుల్లో కోటి కలల కాంతిని నింపుకొని…..మోమున ముచ్చటిగోలిపే ధరహాసాన్ని దాచి,కుంచెను పట్టుకొని మెలితిప్పుతూ బొమ్మను గీచిన రవి వర్మలా చేతిన గడ్డిపరకను పట్టుకొనిContinue reading “అతని జాడేది …”
ఎదురుచూస్తా…
నా కనుపాపల లోయల్లో కదలాడే కన్నీటి బొట్లకు నే సాక్షాన్నై…..నా ఊహల్లో అనంత విశ్వపు నిట్టూర్పుల కూర్పులో చిక్కివిలపించిన దేహాన్నై సాగిపోతుంటే ……కరిమబ్బులు అన్నీ…. నలుదిక్కుల నన్ను మూసేసి…. పయనించే దారులన్నీ…….పగబట్టి శత్రువవోలే నన్ను మ్రింగ యోచన చేస్తే……. జడివానలు నను తడిపేసి…..వడగాల్పులై కబళించి వేస్తుంటే…..కనుపాపల లోగిలిలో పెనుచీకటి కమ్ముకు వచ్చి నా జీవాన్ని పెకలించి వేయాలని చూస్తుంటే…..మరణ మృదంగమే నా చెవులకు వింపుగా వినబడుతుంటే……ఈ కష్టాల కడలిలో…….కటిక పేదరికపు వాసన లో కూడా ఇంత కన్నీటిContinue reading “ఎదురుచూస్తా…”
మౌనమేలనోయి ….
మనసా మౌనమేలనోయ్…..ఒంటరినని వేధన పడితివా…..తుంటరి మనిషికై వేగిర పడుతుంటివా….క్షణకాలపు ఆనంద సంబరము నిను చేరిన….ఆకాశ విశాలంతా….పెద్ధగై మయూరి నాట్య కవళికలు అన్ని నీలోనే చూపిస్తావే…..చిరు కంట కన్నీరుల ధార జడివానల నిను తొలిచేస్తే….అలల సంద్రపు ఉరకలు ఒడ్డున చేరు వరకు వేదనను ఒంటరివై బరిస్తావే…..నిను మెప్పింప అందం కనుల కంట పడినా …ఉప్పొంగు ప్రేమ అనంత విశ్వంలో కనపడదే…..ఇన్ని లయల హొయలు నీకేలనే….మార్పుల చేర్పులలో మునిగి తేలుతున్న హృదయమానీవులేని నా ఈ దేహమునకు విలువేముందే….మట్టిన కలసిపోవు నాకుContinue reading “మౌనమేలనోయి ….”
The Journey Begins
Thanks for joining me! Good company in a journey makes the way seem shorter. — Izaak Walton