మనసా మౌనమేలనోయ్…..
ఒంటరినని వేధన పడితివా…..
తుంటరి మనిషికై వేగిర పడుతుంటివా….
క్షణకాలపు ఆనంద సంబరము నిను చేరిన….
ఆకాశ విశాలంతా….పెద్ధగై మయూరి నాట్య కవళికలు అన్ని నీలోనే చూపిస్తావే…..
చిరు కంట కన్నీరుల ధార జడివానల నిను తొలిచేస్తే….
అలల సంద్రపు ఉరకలు ఒడ్డున చేరు వరకు వేదనను ఒంటరివై బరిస్తావే…..
నిను మెప్పింప అందం కనుల కంట పడినా …
ఉప్పొంగు ప్రేమ అనంత విశ్వంలో కనపడదే…..
ఇన్ని లయల హొయలు నీకేలనే….
మార్పుల చేర్పులలో మునిగి తేలుతున్న హృదయమా
నీవులేని నా ఈ దేహమునకు విలువేముందే….
మట్టిన కలసిపోవు నాకు జీవమై నాలో ప్రాణాన్ని నింపి….నను మనిషిగా నిల్పి…. నీ హావ భావాలు నాలో పలికిస్తున్న నీకు నా పాదాభి వందనం….అంటూ తన మనసుతో తానే మాట్లాడుకుంటున్న అమ్మాయిల హృదయ అంతరంగాన్ని తెలుపుతూ చెప్తున్న మాటే శుభోదయం మిత్రులారా…..
💐!!నేను మీ శశిరేఖ!!💐
