నా కనుపాపల లోయల్లో కదలాడే కన్నీటి బొట్లకు నే సాక్షాన్నై…..
నా ఊహల్లో అనంత విశ్వపు నిట్టూర్పుల కూర్పులో చిక్కి
విలపించిన దేహాన్నై సాగిపోతుంటే ……
కరిమబ్బులు అన్నీ…. నలుదిక్కుల నన్ను మూసేసి….
పయనించే దారులన్నీ…….పగబట్టి శత్రువవోలే నన్ను మ్రింగ యోచన చేస్తే…….
జడివానలు నను తడిపేసి…..వడగాల్పులై కబళించి వేస్తుంటే…..
కనుపాపల లోగిలిలో పెనుచీకటి కమ్ముకు వచ్చి నా జీవాన్ని పెకలించి వేయాలని చూస్తుంటే…..
మరణ మృదంగమే నా చెవులకు వింపుగా వినబడుతుంటే……
ఈ కష్టాల కడలిలో…….కటిక పేదరికపు వాసన లో కూడా ఇంత కన్నీటి సంద్రం దరి చేరలేదే…అని మనసుకు ఏదో బరువు……
ఎందుకు ఈ భారం….. ఎవరికి ఈ దూరం…
చివరికి నేను ఎక్కడికి….
ఒంటరి పయనం జంటగా జత చేరువ వరకా… వేచి చూస్తా కను వాకిట తోడు కోసం……అంటూ కష్టాల కడలిలో ఉన్న ఒక అమ్మాయి కన్నీటి కథను మీతో తెలుపుతూ చెప్తున్న మాటే శుభోదయం మిత్రులారా…..
💐!!నేను మీ శశిరేఖ!!💐
