నీ చిరునవ్వుతో చిత్రహింసలెన్నో పెడతావే…..
మల్లె మొగ్గవు నీవై మత్తులో దించుతావే….
ఎన్నని చెప్పను ఉపమానాలు……
ఎక్కడని వెతకను నా చిరునామాను….
కనిచూపు వలను విసిరి….
వెంట పడినా అందకుండా ఎందుకిలా వేధిస్తావు…
ఏదని చెప్పను నీ సాటి అందం…
ఎంతని చెప్పను నిను చూసిన క్షణం నాలో ఆనందం…
నీ కులుకుతో కునుకు దరిచేరనివ్వవు…
కునుకుపట్టి నిదరోతే కలవై చేరి కనులుతెరువనివ్వవు
ఏమని చెప్పను నాలో ఈ భావం నీవేనని….
నా ప్రేమకు జీవం నీ తోడేనని…. నా ప్రాణమే నీవని… అంటూ విరహావేదనతో అల్లాడుతున్న ప్రేమికుడి మనసు బాధ ఇది
💐!!నేను మీ శశిరేఖ!!💐
